Kangana Ranaut: చంపేస్తామంటూ కంగ‌నా రనౌత్ కు బెదిరింపులు.. మూడు రాష్ట్రాల పోలీసుల‌కు ఫిర్యాదు!

Kangana Ranaut Complaints Maharashtra Police on Some People Life Threaten through Video

  • ఓ వీడియో ద్వారా కంగ‌నపై కొంద‌రు వ్య‌క్తుల బెదిరింపులు
  • వీడియోను మ‌హారాష్ట్ర, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, పంజాబ్ పోలీసుల‌కు ట్యాగ్ చేసి ఫిర్యాదు
  • కంగ‌నా న‌టించిన తాజా చిత్రం 'ఎమ‌ర్జెన్సీ' నేప‌థ్యంలోనే ఈ బెదిరింపులు

బాలీవుడ్‌ న‌టి, బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వ‌చ్చాయి. కొంద‌రు ఓ వీడియో ద్వారా ఈ మేర‌కు ఆమెపై బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. దాంతో కంగన ఆ వీడియోను మ‌హారాష్ట్ర డీజీపీకి పోస్టు చేస్తూ త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఆమె కోరారు. అలాగే హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, పంజాబ్ పోలీసుల‌ను కూడా వీడియోకు ట్యాగ్ చేశారామె. 

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కంగ‌నా ర‌నౌత్‌ న‌టించిన తాజా చిత్రం 'ఎమ‌ర్జెన్సీ' విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ఇటీవ‌ల మూవీ టీజ‌ర్‌ను రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ పాత్ర‌లో కంగ‌న క‌నిపించ‌నున్నారు. 

ఇక కంగ‌నాను వీడియో ద్వారా బెదిరించిన వ్య‌క్తులు ఓ గ‌దిలో కూర్చుని ఉన్నారు. అందులో ఇద్ద‌రి వేష‌ధార‌ణ‌ మాత్రం నిహంగ్ సిక్కుల త‌ర‌హాలో ఉంది. ఒక‌వేళ ఆ సినిమా విడుద‌లైతే, అప్పడు దాన్ని ఖండిస్తామ‌ని స‌ద‌రు వ్య‌క్తులు వీడియోలో చెప్ప‌డం మ‌నం చూడొచ్చు. అలాగే ఓ వ్య‌క్తి మీ చిత్రాన్ని చెప్పుల‌తో కొడుతామ‌ని హెచ్చ‌రించ‌డం కూడా ఉంది.

ఒక‌వేళ ఎమ‌ర్జెన్సీ సినిమాలో ఖ‌లిస్థానీ నేత జ‌ర్నెయిల్ సింగ్ భింద్రన్వాలేను ఉగ్ర‌వాదిగా చిత్రీక‌రిస్తే ఊరుకోబోమ‌ని వారు హెచ్చ‌రించారు. ఇందిరా గాంధీకి ఏం జ‌రిగిందో గుర్తు ఉంచుకోవాల‌ని బెదిరించారు. భింద్రన్‌వాలేను కొనియాడుతూ విక్కీథామ‌స్ సింగ్ అనే వ్య‌క్తి హెచ్చ‌రించ‌డం వీడియోలో క‌నిపించింది. 

ఇందిర‌ను హ‌త్య చేసిన బాడీగార్డులు స‌త్వంత్ సింగ్‌, బియాంత్ సింగ్ గురించి కూడా ఆ వ్య‌క్తి వీడియోలో ప్ర‌స్తావించ‌డం మ‌నం చూడొచ్చు. దీంతో ఈ వీడియోను కంగ‌న 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌)లో షేర్ చేశారు. వీడియోను మ‌హారాష్ట్ర, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, పంజాబ్ పోలీసుల‌కు ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశారు. త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిందిగా మ‌హారాష్ట్ర డీజీపీని కోరారు.

More Telugu News