annamaiah dist: మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో వేకువజాము వరకూ సీఐడీ తనిఖీలు
- మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించిన సీఐడీ అధికారులు
- సోమవారం రాత్రి 11 గంటల నుండి మంగళవారం వేకువ జాము వరకూ తనిఖీలు
- సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో తనిఖీలు
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో రికార్డుల దహనం కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయిన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి సీఐడీకి అప్పగించింది. దస్త్రాల దహన ఘటనపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో భాగంగా సోమవారం రాత్రి 11 గంటల నుండి మంగళవారం వేకువజాము 3 గంటల వరకూ ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు.
సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, అదనపు ఎస్పీ రాజ్‌కమల్, డీఎస్పీ వేణుగోపాల్ బృందం తనిఖీలు చేపట్టింది. దస్త్రాల దహనం ఘటనకు సంబంధించి అధికారులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ తోపాటు, ప్రత్యక్ష సాక్షి నిమ్మనపల్లె వీఆర్ఏ రమణయ్య, ఘటన ముందు వరకూ ఆఫీసులో ఉన్న ఆర్‌డీఓ హరిప్రసాద్ లను సబ్ కలెక్టరేట్ కు పిలిపించి సీఐడీ అధికారులు విచారణ చేశారు.