Rahul Gandhi: ప్రస్తుతం పెళ్లి ప్రణాళికలు లేవు... కానీ: రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rahul Gandhi interesting comments on his marriage

  • ఇటీవల కశ్మీర్ విద్యార్థినులతో మాట్లాడిన రాహుల్ గాంధీ
  • పెళ్లి గురించి కాంగ్రెస్ అగ్రనేతను ప్రశ్నించిన యువతి
  • ఇప్పుడు ప్రణాళికలు లేవని... కానీ తోసిపుచ్చలేమని వ్యాఖ్య
  • పెళ్లికి అందర్నీ ఆహ్వానిస్తానని రాహుల్ గాంధీ హామీ

ప్రస్తుతానికి వివాహ ప్రణాళికలు ఏమీలేవని... అలా అని వాటిని తోసిపుచ్చలేమని ఏఐసీసీ అగ్రనాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇటీవల జమ్ము కశ్మీర్‌లో పర్యటించిన ఆయన శ్రీనగర్‌కు చెందిన విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ యువతి పెళ్లి గురించి అడిగారు.

యువతులతో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ... పెళ్లి చేసుకోవాలని మీ పెద్దల నుంచి ఒత్తిడి వస్తుందా? అని అడిగారు. ఈ సమయంలో ఓ యువతి మీరు వివాహం ఎప్పుడు చేసుకుంటారని ఎదురు ప్రశ్నించింది.

దానికి రాహుల్ గాంధీ నవ్వుతూ సమాధానం చెప్పారు. ఇరవై ముప్పై ఏళ్ల నుంచి ఈ ఒత్తిడిని అధిగమిస్తూ వస్తున్నానన్నారు. ఇప్పుడు పెళ్లి ప్రణాళికలు లేనప్పటికీ, కొట్టి పారేయలేమన్నారు.

ఈ సమయంలో విద్యార్థులు జోక్యం చేసుకొని, పెళ్లి చేసుకుంటే తమను పిలవాలని కోరారు. తప్పకుండా అందర్నీ ఆహ్వానిస్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ అగ్రనేత తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

More Telugu News