Telangana: తెలంగాణలో సీజనల్ వ్యాధులపై కీలక డేటా విడుదల
- జనవరి 1 నుంచి ఆగస్ట్ 25 వరకు 5,372 కేసులు నమోదు
- హైదరాబాద్‌లో 1,852 హైరిస్క్ డెంగ్యూ కేసులు నమోదు
- 152 చికెన్ గున్యా, 191 మలేరియా కేసులు నమోదైనట్లు వెల్లడి
తెలంగాణలో సీజనల్ వ్యాధులపై హెల్త్ డిపార్టుమెంట్ కీలక డేటాను విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటి వరకు నమోదైన డెంగ్యూ కేసు వివరాలను వెల్లడించింది. జనవరి 1వ తేదీ నుంచి నిన్న... ఆగస్ట్ 25 వరకు 5,372 కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇందులో హైరిస్క్ డెంగ్యూ కేసులు కూడా ఉన్నట్లు తెలిపింది.
హైరిస్క్ డెంగ్యూ కేసులు హైదరాబాద్‌లో 1,852, సూర్యాపేటలో 471, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 426, ఖమ్మంలో 375, నల్గొండలో 315, నిజామాబాద్‌లో 286, రంగారెడ్డిలో 232, జగిత్యాలలో 185, సంగారెడ్డిలో 160, వరంగల్‌లో 110 డెంగ్యూ కేసులు నమోదైనట్లు వెల్లడించింది.
తెలంగాణలో చికెన్ గున్యా కేసులు 152, మలేరియా కేసులు 191 నమోదైనట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహించగా 1.42 కోట్లకు పైగా ఇళ్లను వైద్య బృందం సందర్శించింది. ఈ సర్వేలో 2.65 లక్షల మందికి పైగా జ్వరాలు ఉన్నట్లు గుర్తించారు.