HYDRA: 'ఎక్స్‌'లో ఖాతాను ప్రారంభించిన 'హైడ్రా'

HYDRA opens account in X

  • అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా
  • ఎన్ కన్వెన్షన్ సహా పలు కూల్చివేతలతో హైడ్రా సంచలనం
  • సోషల్ మీడియాలో అడుగు పెట్టిన హైడ్రా

ఇటీవల ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌తో పాటు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న 'హైడ్రా' సోషల్ మీడియాలో కాలు మోపింది. హైడ్రా... చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేతలు చేపడుతోంది.

ఇటీవల కూల్చివేతలతో సంచలనంగా మారిన హైడ్రా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ "ఎక్స్‌"లో ఖాతాను తెరిచింది. 'కమిషనర్ హైడ్రా' పేరుతో ఈ ఖాతాను ఓపెన్ చేసింది. గతంలో ఉన్న ఈడీవీఎం (ఎన్‌‌ఫోర్స్‌మెంట్ విజలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్) ఖాతానే 'హైడ్రా'గా మార్చినట్లుగా భావిస్తున్నారు.

HYDRA
N Convention
Telangana
Hyderabad
  • Loading...

More Telugu News