Sheikh Noorjahan: వైసీపీకి గుడ్ బై చెప్పిన ఏలూరు నగర మేయర్ నూర్జహాన్... రేపు టీడీపీలోకి!

Eluru mayor Noorjahan resigned to YSRCP

  • వైసీపీకి రాజీనామా చేసిన నూర్జహాన్
  • రేపు భర్తతో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక!
  • వారితో పాటు టీడీపీలో చేరనున్న పలువురు కార్పొరేటర్లు

ఇటీవల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో దారుణ ఫలితాలు చవిచూసిన వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏలూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్ వైసీపీకి రాజీనామా చేశారు. ఆమె రేపు తన భర్త పెదబాబుతో కలిసి టీడీపీలో చేరనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో నూర్జహాన్ దంపతులు పసుపు కండువా కప్పుకోనున్నారు. 

వారితో పాటు ఏలూరులోని పలువురు కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరనున్నారు. దాంతో ఏలూరు నగరపాలక సంస్థ టీడీపీ వశం అయ్యే అవకాశాలున్నాయి.

Sheikh Noorjahan
Mayor
Eluru
Pedababu
TDP
YSRCP
  • Loading...

More Telugu News