Amy Jackson Wedding: హాలీవుడ్‌ నటుడుని పెళ్లి చేసుకున్న అమీ జాక్సన్

Amy Jackson Wedding

  • హాలీవుడ్‌ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో ఘ‌నంగా అమీ జాక్సన్ వివాహం
  • కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట‌కు తాజాగా ఇటలీలో పెళ్లి 
  • ఇంత‌కుముందు జార్జ్‌ పనియోటౌ అనే వ్యాపారవేత్తతో అమీ సహజీవనం
  • ఈ జంటకు ఆండ్రూ అనే బాబు
  • మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా విడిపోయిన అమీ, జార్జ్‌

నటి అమీ జాక్సన్‌, హాలీవుడ్‌ నటుడు ఎడ్‌ వెస్ట్‌విక్‌ వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. సోషల్‌ మీడియా వేదికగా ఇరువురు తమ పెళ్లి ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైందంటూ ఫ్యాన్స్‌కు పెళ్లి కబురు చెప్పారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట‌ తాజాగా ఇటలీలో పెళ్లి చేసుకుంది.

అయితే అమీ జాక్సన్‌ గతంలో కొంతకాలం పాటు జార్జ్‌ పనియోటౌ అనే వ్యాపారవేత్తతో సహజీవనం చేశారు. ఈ జంటకు ఆండ్రూ అనే బాబు పుట్టాడు. 2020లో అమీ, జార్జ్‌ వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత వారి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. 

ఈ క్ర‌మంలో సౌదీలో జరిగిన ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌ను అమీ జాక్సన్ తొలిసారి కలిశారు. ఆ సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇప్పుడు ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. 

కాగా, అమీ జాక్సన్ తెలుగులో 'ఎవడు', 'ఐ', '2. ఓ' సినిమాలు చేశారు. ఆమె నటించిన మిషన్‌: ఛాప్టర్‌ 1 (తమిళ్‌), క్రాక్‌ (హిందీ) ఇటీవల రిలీజ్ అయ్యాయి. కాగా, అమీ ఇటు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో కూడా న‌టించారు.

View this post on Instagram

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

Amy Jackson Wedding
Ed Westvick
Tollywood
Bollywood
Kollywood
  • Loading...

More Telugu News