Oil Companies: చమురు సంస్థలకు జరిమానా విధించిన స్టాక్ ఎక్చేంజ్ లు.. ఎందుంకటే...!

Stock Exchanges imposes fine over oil companies

  • నిబంధనలు పాటించని చమురు సంస్థలు
  • సంస్థల బోర్డుల్లో నిర్దేశిత సంఖ్యలో స్వతంత్ర మహిళా డైరెక్టర్లు లేరంటూ జరిమానా
  • డైరెక్టర్ల నియామకం తమ చేతుల్లో ఉండదంటున్న చమురు సంస్థలు

స్టాక్ ఎక్స్చేంజ్ లు దేశంలోని పలు చమురు సంస్థలకు జరిమానా వడ్డించాయి. ఆయా చమురు సంస్థల బోర్డుల్లో నిర్దేశిత సంఖ్యలో స్వతంత్ర మహిళా డైరెక్టర్లు లేకపోవడంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ జరిమానా వడ్డించాయి. హెచ్ పీసీఎల్, ఐవోసీ, బీపీసీఎల్, గెయిల్, ఎమ్మార్పీఎల్ సంస్థలు జరిమానాకు గురయ్యాయి. 

ఈ అతిపెద్ద చమురు సంస్థలు ఈ విధంగా జరిమానాకు గురికావడం వరుసగా ఐదోసారి. జూన్ 30తో త్రైమాసికం ముగిసిన నాటికి ఆయా బోర్డుల్లో నిర్దిష్ట సంఖ్యలో మహిళా డైరెక్టర్లను నియమించడంలో విఫలం అయినట్టు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ గుర్తించాయి. 

ఆయా సంస్థలు తమ బోర్డుల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఎంతమంది ఉంటారో, అదే సంఖ్యలో స్వతంత్ర డైరెక్టర్లను కలిగి ఉండలని,  కనీసం ఒక్క మహిళా డైరెక్టర్ ను అయినా కలిగి ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. అయితే, బోర్డులో డైరెక్టర్ల నియామకం పెట్రోలియం మంత్రిత్వ శాఖ చేతుల్లో ఉంటుందని ఆయా కంపెనీలు పేర్కొన్నాయి. డైరెక్టర్ల నియామకం తమ నియంత్రణలో లేని అంశం అని చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News