Balakrishna: ఆదుకోవడానికి ఆలోచించని హీరో బాలకృష్ణ: నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్

Shivalenka Krishna Prasad Interview

  • బాలూ వలన 'ఆదిత్య 369' దక్కిందన్న నిర్మాత 
  • 'వంశానికొక్కడు' హిట్ తెచ్చిపెట్టిందని వెల్లడి 
  • ఒక దశలో బాగా నష్టపోయానని వ్యాఖ్య 
  • ఆ సమయంలో బాలయ్య చేశాడని వివరణ  


శివలెంక కృష్ణప్రసాద్ .. తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ ప్రొడ్యూసర్. చాలా చిన్న వయసులోనే ఆయన నిర్మాణ రంగం వైపు అడుగువేశారు. 1988లో 'చిన్నోడు పెద్దోడు' సినిమాతో, నిర్మాతగా ఆయన ప్రయాణం మొదలైంది. నానీతో 'జెంటిల్ మెన్' .. సుధీర్ బాబు 'సమ్మోహనం' .. సమంతతో 'యశోద' వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించినది ఆయనే.

తాజాగా తెలుగు వన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ .. 'ఆదిత్య 369' సినిమాకి నేను నిర్మాతగా ఉండటానికి కారకులు ఎస్పీ బాలుగారు. సింగితం గారి దగ్గర మంచి కథ ఉందని చెప్పి .. నన్ను వెళ్లి కలవమన్నారు. ఆ సినిమాతో బాలకృష్ణగారితో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత ఆయనతో 'వంశానికొక్కడు' సినిమా చేశాను. అది కూడా 100 డేస్ ఆడింది" అన్నారు.  

" ఆ తరువాత నేను ఒకటి రెండు సినిమాలు నిర్మించి దెబ్బతిన్నాను. అలాగే ఒకటి రెండు సినిమాలకు సంబంధించిన హక్కులను తీసుకుని నష్టపోయాను. అలాంటి సమయంలో నేను బాలయ్యను కలుసుకుని .. ఇలా ఇబ్బందుల్లో ఉన్నాను ఒక సినిమా చేసి పెట్టమని అడిగాను. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా 'చేస్తున్నాం' అన్నారు.

"బాలయ్య ఎంతమాత్రం ఆలోచించకుండా నాకు మాటిచ్చిన ఆ క్షణాలను నేను ఎప్పటికీ మరిచిపోలేను. 'భలే వాడివి బాసూ' మాత్రమే కాదు, ఆ తరువాత 'మిత్రుడు' సినిమాను కూడా నాకు చేసి పెట్టారు. అయితే ఆ రెండు ప్రాజెక్టుల విషయంలో ఆయన నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ను నేను ఉపయోగించుకోలేకపోయాను" అంటూ చెప్పారు. 

Balakrishna
Balu
Shivalenka Krishna Prasad
  • Loading...

More Telugu News