Kay Kay Menon: జీ 5 తెరపైకి మరో క్రైమ్ థ్రిల్లర్!

Murshid Web Series Update

  • ముంబై నేపథ్యంలో సాగే 'ముర్షిద్'
  • గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్న కేకే మీనన్ 
  • జీ 5 ద్వారా పలకరించనున్న సిరీస్ 
  • ఈనెల 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్


ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ కి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. అందువలన ప్రతి ఓటీటీ సంస్థ థ్రిల్లర్ నేపథ్యంలోని కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి ఉత్సాహాన్ని చూపిస్తోంది. అలా 'జీ 5' ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి మరో క్రైమ్ థ్రిల్లర్ రెడీ అవుతోంది ..  ఆ సిరీస్ పేరే 'ముర్షిద్'. 

కేకే మీనన్ ప్రధానమైన పాత్రను పోషించిన సిరీస్ ఇది. నటుడిగా కేకే మీనన్ కి మంచి పేరు ఉంది. ప్రస్తుతం ఆయన వరుస వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నాడు. కొన్ని రోజుల క్రితమే ఆయన ప్రధానమైన పాత్రను పోషించిన 'శేఖర్ హోమ్స్' జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే కథ అది.

 ఇక 'ముర్షిద్' విషయానికి వస్తే .. అడుగడుగునా అనూహ్యమైన మలుపులతో సాగే క్రైమ్ థ్రిల్లర్ ఇది.  'ముర్షిద్' ముంబైని గడగడలాడించిన ఓ గ్యాంగ్ స్టర్. ముంబై సుల్తాన్ గా అతనికి పేరు.  కొన్ని కారణాల వలన ఆయన ఆయుధాలకు .. అక్రమాలకూ దూరంగా బ్రతుకుతూ ఉంటాడు. అయితే మళ్లీ అతను ఆయుధం పట్టుకోవలసిన పరిస్థితి వస్తుంది.

'ముర్షిద్' మళ్లీ రంగంలోకి దిగుతాడు. దాంతో అతని శత్రువుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏమిటంటే ముర్షిద్ కొడుకు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కావడమే. ముర్షిద్ మళ్లీ ఎందుకు ఆయుధం పట్టుకున్నాడు? అందుకు కారకులు ఎవరు? తండ్రీ కొడుకుల మధ్య జరిగే పోరాటం ఎలా ఉండబోతోంది? అనేది కథ. ఈ నెల 30వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.                


Kay Kay Menon
Vedika Bhandari
Anang Desai
Tanuj Virwani
  • Loading...

More Telugu News