: విజయసాయిని మరో జైలుకు తరలించండి : సీబీఐ
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ముఖ్య నిందితుడు, ఆడిటర్ విజయసాయిరెడ్డిపై కోర్టులో సీబీఐ మెమో దాఖలు చేసింది. చంచల్ గూడ జైలు నుంచి ఆయనను మరో జైలుకు తరలించాలని మెమోలో పేర్కొంది. జగన్, విజయసాయి ఒకే జైలులో ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తెలిపింది. మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో మూడు రోజుల కిందటే విజయసాయి కోర్టు ఎదుట లొంగిపోయారు.