Kolkata Horror: కోల్‌కతా హారర్.. వైద్యురాలిపై హత్యాచారానికి కొన్ని గంటల ముందు జరిగింది ఇదే!

Kolkata Horror What happened in victims final hours

  • బాధిత విద్యార్థితో చివరి గంటలో గడిపిన నలుగురు సహచరులు
  • ఆమె మృతదేహాన్ని తొలుత చూసింది కూడా వీరే
  • వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన సెమినార్ హాల్‌లో వీరిలో ఇద్దరి వేలిముద్రలు
  • ఈ కేసులో వీరు నిందితులు కాకున్నా పరస్పర విరుద్ధంగా వాంగ్మూలాలు
  • 22 నిమిషాల వ్యవధిలో బాధిత కుటుంబానికి చేసిన రెండు వేర్వేరు ఫోన్ కాల్స్‌లో వేర్వేరుగా చెప్పిన వైనం
  • అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు పాలిగ్రాఫ్ టెస్టుకు కోల్‌కతా హైకోర్టు అనుమతి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా హత్యాచార ఘటన విషయంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ ఘటనలో అసువులు బాసిన వైద్యురాలితో చివరి గంటలో గడిపిన నలుగురు సహచరులకు పాలిగ్రాఫ్ టెస్ట్ (లై డిటెక్టర్ టెస్ట్) నిర్వహించేందుకు సీబీఐకి కలకత్తా హైకోర్టు అనుమతినిచ్చింది. పాలిగ్రాఫ్ టెస్టులో వైద్యురాలి చివరి గంటల్లో ఏం జరిగిందనేది తెలుసుకోవచ్చని సీబీఐ భావిస్తోంది. 

31 ఏళ్ల బాధితురాలితో చివరి గంటల్లో గడిపిన నలుగురిలో ఇద్దరు ఫస్టియర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టైనీలు, ఒక హౌస్ సర్జన్, ఇంటర్న్‌షిప్ చేస్తున్న మరొకరు ఉన్నారు. వీరందరూ కలిసి బాధిత వైద్యురాలితో కలిసి ఘటన జరగడానికి ముందు డిన్నర్ చేశారు. ఈ కేసులో వీరు నిందితులు కానప్పటికీ వారి వాంగ్మూలాలు మాత్రం పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. 

వైద్యురాలు హత్యాచారానికి గురవడానికి ముందు, తర్వాత తొలుత చూసింది కూడా వీరే. సాక్ష్యాలను ట్యాంపరింగ్ చేయడానికి వీరేమైనా ప్రయత్నించారా? అన్న విషయాన్ని పాలిగ్రాఫ్ టెస్టు ద్వారా తెలుసుకోవాలని సీబీఐ భావిస్తోంది. వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన ఆసుపత్రి మూడో అంతస్తులోని సెమినార్ రూములో ఈ నలుగురిలో ఇద్దరి వేలిముద్రలను సీబీఐ గుర్తించింది. 

ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన సమయంలో ఉదయం 10.53 గంటల నుంచి 11.15 గంటల మధ్య ఏం జరిగిందనేది సీబీఐకి మిస్టరీగా మారింది. బాధిత కుటుంబానికి తొలుత ఫోన్ చేసినప్పుడు వైద్యురాలు అస్వస్థతకు గురైనట్టు చెప్పారు. ఆ తర్వాత 11.15 గంటలకు రెండోసారి ఫోన్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పారు.  ఈ నేపథ్యంలో ఆ 22 నిమిషాల మధ్య ఏం జరిగిందనేది తెలుసుకోవాలని భావిస్తున్న సీబీఐ పాలిగ్రాఫ్ టెస్టుకు అనుమతి పొందింది.

  • Loading...

More Telugu News