GST Hackathon: జీఎస్టీ హ్యాకథాన్.. గెలిస్తే రూ.50 లక్షలు మీవే!

GST Hackathon with Rs 50 lakhs prizemoney

  • జీఎస్టీ అనలిటిక్స్ ఫ్రేమ్ వర్క్ కోసం హ్యాకథాన్
  • ఊహాత్మక నమూనా రూపకల్పన చేసిన వారికి బహుమతులు
  • మొదటి బహుమతి రూ.25 లక్షలు

భారత్ లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్ వర్క్ (జీఎస్టీఎన్) జీఎస్టీ అనలిటిక్స్ హ్యాకథాన్ నిర్వహిస్తోంది. ఈ హ్యాకథాన్ కు మొత్తం రూ.50 లక్షలు ప్రైజ్ మనీగా నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

భారత విద్యార్థులు, పరిశోధకులు... కంపెనీలు, స్టార్టప్ లలో పనిచేసే వృత్తి నిపుణులు ఈ పోటీలో పాల్గొనాలని కేంద్రం ఆహ్వానించింది. జీఎస్టీ అనలిటిక్స్ ఫ్రేమ్ వర్క్ రూపకల్పన కోసం ఓ ఊహాత్మక నమూనాను అభివృద్ధి చేయడమే ఈ హ్యాకథాన్ లక్ష్యం. 

ఈ హ్యాకథాన్ 45 రోజుల పాటు సాగనుంది. ఇందులో విజేతకు రూ.25 లక్షలు, సెకండ్ ప్రైజ్ గా రూ.12 లక్షలు, మూడో బహుమతిగా రూ.7 లక్షలు, రూ.1 లక్ష చొప్పున కన్సోలేషన్ ప్రైజులు ఇస్తారు. అంతేకాదు, ఈ హ్యాకథాన్ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన మహిళా బృందానికి రూ.5 లక్షల ప్రత్యేక బహుమతి ఇస్తారు. 

పోటీలో పాల్గొనాలనుకునేవారు తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలు, మార్గదర్శకాల కోసం https://event.data.gov.in/event/gst-analytics-hackathon/ వెబ్ పోర్టల్ ను సందర్శించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

  • Loading...

More Telugu News