Forex: భారీగా పెరిగిన భారత్ విదేశీ మారకద్రవ్యం

Indian forex raises huge

 


ప్రపంచ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరలించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్న భారత్ కు సానుకూలాంశాలు కనిపిస్తున్నాయి. తాజాగా, భారత విదేశీ మారకద్రవ్యం భారీగా పెరిగింది. 

ఆగస్టు 16 నాటికి భారత్ ఖాతాలో ఉన్న విదేశీ మారకద్రవ్యం రూ.56.5 లక్షల కోట్లు అని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వెల్లడించింది. వారం రోజుల వ్యవధిలో భారత్ విదేశీ మారకద్రవ్యం రూ.38,137  కోట్ల మేర పెరుగుదల నమోదు చేసుకుందని ఆర్బీఐ వివరించింది. 

అదే సమయంలో, ఆగస్టు 16 నాటికి నగదు రూపేణా ఆస్తుల విలువ రూ.30,178 కోట్లు పెరిగి రూ.49.5 లక్షల కోట్లకు చేరిందని తెలిపింది. బంగారం నిల్వలు రూ.7,251 కోట్ల పెరుగుదలతో రూ.5.03 లక్షల కోట్లకు చేరినట్టు ఆర్బీబీ డేటా వెల్లడించింది.

  • Loading...

More Telugu News