Revanth Reddy: కేంద్రమంత్రి సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

CM Revanth Reddy meets Union Minister Jyotiraditya Scindia

  • డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో కలిసి కేంద్రమంత్రితో రేవంత్ సమావేశం
  • టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్-3లో చేర్చాలని విజ్ఞప్తి
  • డీపీఆర్‌ను ఆమోదించాలని కోరిన రేవంత్ రెడ్డి

కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కేంద్రమంత్రిని కలిశారు. టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్-3లో చేర్చాలని వారు కేంద్రమంత్రిని కోరారు. ఇందుకు సంబంధించి సమర్పించిన డీపీఆర్‌ను ఆమోదించాలని కోరారు. కేంద్రమంత్రితో సీఎం, ఉపముఖ్యమంత్రి కాసేపు చర్చలు జరిపారు.

తెలంగాణ ప్రాంతంలోని గ్రామాలు, మండలాలకు నెట్ వర్క్ కల్పించడమే టీ ఫైబర్ లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం... కేంద్రమంత్రికి తెలిపారు. 65 వేల ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News