Hema: హేమకు ఊరట.. సస్పెన్షన్ ఎత్తివేసిన 'మా'

MAA lifts suspension on actress Hema

  • బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్టైన హేమ
  • హేమపై సస్పెన్షన్ వేటు వేసిన 'మా'
  • తన మెడికల్ రిపోర్టులను సమర్పించిన హేమ

సినీ నటి హేమకు ఊరట లభించింది. ఆమెపై విధించిన సస్పెన్షన్ ను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎత్తివేసింది. అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాలతో హేమపై నిషేధాన్ని ఎత్తేస్తూ తీసుకున్న నిర్ణయానికి కమిటీ ఆమోదముద్ర వేసింది.

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ కేసులో హేమను అక్కడి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆమెకు రిమాండ్ కూడా విధించింది. ఇటీవలే ఆమె బెయిల్ పై బయటకు వచ్చారు. 

డ్రగ్స్ కేసు నేపథ్యంలో హేమపై 'మా' సస్పెన్షన్ వేటు వేసింది. అయితే తాను డ్రగ్స్ తీసుకోలేదని... మీడియాలో వచ్చిన వార్తలను ఆధారంగా తీసుకుని తనను సస్పెండ్ చేయడం సరికాదని హేమ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్ లో పరీక్షలు చేయించుకున్నట్టు ఆమె రిపోర్టులు కూడా సమర్పించారు. హేమ ఆధారాలను పరిశీలించిన 'మా' ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమెపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.

Hema
Tollywood
MAA
  • Loading...

More Telugu News