Raghunandan Rao: బ్లిట్జ్ పత్రికలో యువతితో రాహుల్ గాంధీ ఫొటో... సోనియా ఇంటికి వెళ్లిన రఘునందన్ రావు

Raghunandan Rao Visited the residence of Rahul Gandhi

  • బ్లిట్జ్ మేగజైన్ కాపీలను రాహుల్ గాంధీ సిబ్బందికి అందించిన బీజేపీ ఎంపీ
  • రాహుల్ గాంధీ మీటింగ్‌లో ఉండటంతో రిసెప్షన్‌లో ఇచ్చినట్లు వెల్లడి
  • బ్లిట్జ్‌లో వచ్చిన కథనంపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని నిలదీత

మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. బంగ్లాదేశ్ బ్లిట్జ్‌లో వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫొటోపై నిన్న బీజేపీ ఎంపీ మీడియా సమావేశం నిర్వహించారు. 

రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ ఇప్పిస్తే రాహుల్ గాంధీ వద్దకు వెళ్లి బంగ్లాదేశ్ బ్లిట్జ్ మేగజైన్‌లో వచ్చిన ఆయన ఫొటోలను చూపిస్తానని నిన్న మీడియా సమావేశంలో వెల్లడించారు. బ్లిట్జ్‌లో రాహుల్ గాంధీతో ఉన్న అమ్మాయి ఎవరు? ఆమెతో పెళ్లైందా? లేదా, రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? చెప్పాలని నిన్న ప్రశ్నించారు.

ఈరోజు హఠాత్తుగా ఆయన ఢిల్లీలో గాంధీల నివాసం వద్ద ప్రత్యక్షమయ్యారు. బ్లిట్జ్ మేగజైన్ కాపీలను రాహుల్ గాంధీ కార్యాలయంలోని సిబ్బందికి ఇచ్చారు.

అనంతరం, ఆయన రాహుల్ గాంధీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ... బ్లిట్జ్ పత్రికలో వచ్చిన ఈ ఫొటోలకు సంబంధించిన కాపీలను రాహుల్ గాంధీకి ఇచ్చేందుకు తాను వచ్చానని, కానీ ఆయన సమావేశంలో ఉన్నట్లు తెలిసిందన్నారు. రిసెప్షన్ సిబ్బంది ఈ కాపీలను తీసుకున్నదని తెలిపారు.

బ్లిట్జ్‌లో వచ్చిన ఈ కథనంపై వారు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలన్నారు. సోనియా గాంధీ నివాసంలోనే రాహుల్ గాంధీ ఉంటున్నారని, అందుకే ఇక్కడే ఈ కాపీలను ఇచ్చినట్లు చెప్పారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన వివరణ వస్తుందని తాను భావిస్తున్నానన్నారు.

Raghunandan Rao
BJP
Congress
Rahul Gandhi
  • Loading...

More Telugu News