Crocodile: పత్తి చేనులో ప్ర‌త్య‌క్ష‌మైన మొసలి.. భయంతో కూలీల పరుగులు.. ఇదిగో వీడియో!

Crocodile Spotted At Jogulamba Gadwal


తెలంగాణ‌లోని జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని దేవరచెరువు వెనుక ఓ సీడ్ పత్తి చేనులో ఒక మొసలి ప్రత్యక్షమైంది. ఉదయం పొలంలో పనిచేస్తున్న కూలీలకు మొసలి కనిపించడంతో భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అటవీ సిబ్బంది రైతుల సహాయంతో మొసలిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News