Chandrababu: టాప్ 5 సీఎంల జాబితాలో చంద్రబాబు

Chandrababu in top 5 CMs list

  • ఇండియా టుడే - సీ ఓటర్ సర్వే
  • తొలి స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
  • ఐదో స్థానంలో చంద్రబాబు
  • నాలుగో స్థానంలో తమిళనాడు సీఎం స్టాలిన్

మన దేశంలో అత్యంత జనాదరణ కలిగిన టాప్-5 ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబు నిలిచారు. 'మూడ్ ఆఫ్ ది నేషన్' పేరుతో 'ఇండియా టుడే - సీ ఓటర్' దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ జాబితాలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నాలుగో స్థానంలో నిలిచారు. ఏపీ సీఎం చంద్రబాబు ఐదో స్థానంలో ఉన్నారు.
 

అత్యంత జనాదరణ పొందిన సీఎంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మూడో స్థానంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. సీఎంగా బాధ్యతలను చేపట్టిన రెండు నెలల సమయంలోనే టాప్ 5 ముఖ్యమంత్రుల జాబితాలోకి చంద్రబాబు రావడం విశేషం.

Chandrababu
Telugudesam
Popular CM
India Today
CVoter
Mood of the nation
  • Loading...

More Telugu News