National Space Day: జాతీయ అంత‌రిక్ష దినోత్స‌వం.. శుభాకాంక్ష‌లు తెలిపిన‌ ప్ర‌ధాని మోదీ

PM Modi Greetings to everyone on the first National Space Day

  • 'ఎక్స్' వేదిక‌గా దేశ ప్ర‌జ‌ల‌కు మోదీ శుభాకాంక్ష‌లు
  • అంత‌రిక్ష రంగానికి చెందిన‌ ఎన్నో భ‌విష్య‌త్తు నిర్ణ‌యాల‌ను త‌మ ప్ర‌భుత్వ తీసుకుంద‌న్న ప్ర‌ధాని
  • అంతరిక్ష శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించిన మోదీ

నేడు మొద‌టి జాతీయ అంత‌రిక్ష దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపారు. అంత‌రిక్ష రంగానికి సంబంధించిన‌ ఎన్నో భ‌విష్య‌త్తు నిర్ణ‌యాల‌ను త‌మ ప్ర‌భుత్వ తీసుకున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. మునుముందు కూడా మ‌రెన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. అంత‌రిక్ష శాస్త్ర‌వేత్త‌లు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను ఈ సంద‌ర్భంగా మోదీ కొనియాడారు.

"మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అంతరిక్ష రంగంలో మన దేశం సాధించిన విజయాలను ఎంతో గర్వంగా గుర్తు చేసుకుంటున్నాం. మన అంతరిక్ష శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించే రోజు కూడా. మా ప్రభుత్వం ఈ రంగానికి సంబంధించి ఎన్నో భవిష్యత్ నిర్ణయాల‌ను తీసుకుంది. రాబోయే రోజుల్లో మేము ఈ రంగం అభివృద్ధికి మ‌రింత కృషి చేస్తాం"అని మోదీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. 

కాగా, గ‌తేడాది చంద్ర‌యాన్-3 మిష‌న్‌కు చెందిన స్పేస్‌క్రాఫ్ట్‌ విజ‌య‌వంతంగా చంద్రుడిపై దిగిన నేప‌థ్యంలో నేష‌న‌ల్ స్పేస్ డేను ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

More Telugu News