YSRCP: దువ్వాడకు బిగ్ షాక్ ఇచ్చిన జగన్ ..వైసీపీలో కీలక మార్పులు

big shock to mlc duvvada srinivas in tekkali

  • టెక్కలి వైసీపీ ఇన్ చార్జి గా పేరాడ తిలక్ ను నియమించిన వైఎస్ జగన్
  • వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా గడికోట, వేంపల్లి, చెవిరెడ్డి నియామకం
  • అనుబంధ విభాగాలకు నూతన అధ్యక్షుల నియామకం

కుటుంబ పంచాయతీ రచ్చకెక్కడంతో వైసీపీ ఎమ్మెల్సీ, టెక్కలి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ కు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. టెక్కలి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి బాధ్యతల నుండి ఆయనను జగన్ తప్పించారు. ఆయన స్థానంలో పేరాడ తిలక్ ను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. 
 
ఇదే క్రమంలో జగన్ పార్టీలో కీలక మార్పులు..చేర్పులు చేపట్టారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి (రాయచోటి), మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డి (పులివెందుల), మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి(చంద్రగిరి) లను నియమించారు. 
 
ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి మాజీ మంత్రి ఆళ్ల నాని ఇటీవల రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ స్థానంలో కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావును నియమించారు. అలానే వైసీపీ అనుబంధ విభాగాల్లోనూ మార్పులు చేసింది. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడుగా జక్కంపూడి రాజా, బీసీ విభాగం అధ్యక్షుడుగా రమేశ్ యాదవ్, ఎస్సీ విభాగం అధ్యక్షుడుగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, చేనేత విభాగం అధ్యక్షుడుగా గంజి చిరంజీవి, విద్యార్థి విభాగం అధ్యక్షుడుగా పానుగంటి చైతన్యను పార్టీ నియమించింది.

More Telugu News