Kiran Abbavaram: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యువ‌ హీరో.. ఇదిగో వీడియో!

Tollywood Young Hero Kiran Abbavaram Wedding Video

  • ఓ ఇంటివాడైన హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం
  • తోటి న‌టి ర‌హ‌స్య గోర‌క్‌ను పెళ్లాడిన యువ హీరో
  • 'రాజావారు రాణిగారు' మూవీలో హీరోహీరోయిన్లుగా న‌టించిన జంట‌

టాలీవుడ్ యువ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఓ ఇంటివాడ‌య్యాడు. త‌న తెరంగేట్రం మూవీ 'రాజావారు రాణిగారు'లో న‌టించిన తోటి న‌టి ర‌హ‌స్య గోర‌క్‌ను ప‌రిణ‌య‌మాడాడు. గురువారం కుటుంబ స‌భ్యులు, అతికొద్ది మంది అతిథుల స‌మ‌క్షంలో ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. 

2019లో తొలి చిత్రం 'రాజావారు రాణిగారు' షూటింగ్ స‌మ‌యంలో కిర‌ణ్, ర‌హ‌స్య మధ్య ఏర్ప‌డిన స్నేహం కాస్తా ఆ త‌ర్వాత ప్రేమ‌గా మారింది. దీంతో కొంత‌కాలం ప్రేమ‌ను ఎంజాయ్ చేసిన ఈ జంట కొన్ని రోజుల క్రితం తాము పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. గురువారం వివాహ బంధంతో ఒక్క‌టైంది. ఈ పెళ్లి తాలూకు వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

More Telugu News