Pawan Kalyan: చెల్లెలితో పవన్ కల్యాణ్ చిన్నప్పటి ఫొటో ఇదిగో!

Pawan Kalyan shared a photo with his younger sister Madhavai


ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఆసక్తికర ఫొటో పంచుకున్నారు. తన చెల్లెలు మాధవితో కలిసి చిన్నప్పుడు తీయించుకున్న ఫొటో ఇది. ముందు బొమ్మ పులుల, బ్యాక్ గ్రౌండ్ లో ఓ భవనం కనిపిస్తుండగా... పవన్, మాధవి చేయి చేయి పట్టుకుని నిల్చుని ఉండడం ఆ ఫొటోలో చూడొచ్చు. ఈ ఫొటోపై పవన్ స్పందిస్తూ... ఇదొక మధురమైన జ్ఞాపకం అని పేర్కొన్నారు. బెంగాల్ టైగర్ల ప్రతిరూపాల వద్ద తాము ఫొటోకి పోజు ఇచ్చామని వెల్లడించారు.

More Telugu News