Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన గోద్రెజ్ ఇండస్ట్రీస్ అధినేత
- అమరావతి విచ్చేసిన నాదిర్ గోద్రెజ్
- రూ.2,800 కోట్ల పెట్టుబడులపై కీలక చర్చ
- చర్చలు సంతృప్తికరంగా సాగాయన్న సీఎం చంద్రబాబు
గోద్రెజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ నాదిర్ గోద్రెజ్ నేడు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. కేంద్ర ప్రాయోజిత పథకం ఎన్ఎంఈవో ఓపీ రాష్ట్రంలో అమలు జరుగుతున్న తీరు పట్ల ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంపై సీఎం చంద్రబాబు స్పందించారు.
రూ.2,800 కోట్ల పెట్టుబడులపై కీలక చర్చలు జరిగాయని వెల్లడించారు. అమరావతి, విశాఖపట్నంలో పురుగుమందుల తయారీపై చర్చించామని తెలిపారు. రొయ్యల మేత, ఆయిల్ పామ్ సాగుపైనా చర్చలు జరిగాయని చంద్రబాబు వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పురోగతి దిశగా చర్చలు సంతృప్తికరంగా సాగాయని వెల్లడించారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నాం: మంత్రి నారా లోకేశ్
ఏపీలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని మంత్రి నారా లోకేశ్ ఆహ్వానం పలికారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని తెలిపారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారం దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. పెట్టుబడిదారుల పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.