Telangana: తెల్ల రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త!

TG government good news for white ration card holders

  • తెల్ల రేషన్ కార్డుదారులకు జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామన్న మంత్రి
  • రేషన్ బియ్యం పక్కదారి పడితే డీలర్‌షిప్ రద్దు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరిక
  • ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాల్లో డీలర్ల భర్తీకి చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడి

తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రేషన్ కార్డుదారులకు వచ్చే జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం వెల్లడించారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలా చేస్తే డీలర్‌షిప్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాలకు సంబంధించి... 1,629 రేషన్ డీలర్ల భర్తీకి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News