Supreme Court: కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసును రాజకీయం చేయకండి: కేంద్రం, బెంగాల్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు హితవు

Chief Justice To Centre Bengal In Kolkata Rape Murder

  • విచారణ వేళ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, బెంగాల్ ప్రభుత్వ న్యాయవాది కపిల్ సిబల్ మధ్య వాగ్వాదం
  • రెచ్చగొట్టే ప్రకటనలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరిన సిబల్
  • బెంగాల్ మంత్రి కూడా వ్యాఖ్యలు చేశారన్న తుషార్ మెహతా
  • దయచేసి ఈ ఘటనను రాజకీయం చేయవద్దని సీజేఐ చంద్రచూడ్ సూచన

కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసును రాజకీయం చేయవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కేంద్రానికి, అలాగే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ఇరు ప్రభుత్వాల న్యాయవాదులను కోరారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.

సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, బెంగాల్ ప్రభుత్వ న్యాయవాది కపిల్ సిబల్ మధ్య వాగ్వాదం జరిగింది.

రెచ్చగొట్టే ప్రకటనలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కపిల్ సిబల్ కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాఖ్యలపై తుషార్ మెహతా స్పందిస్తూ... ఎవరూ అలాంటి ప్రకటనలు చేయవద్దని, పశ్చిమ బెంగాల్‌కు చెందిన మంత్రి చేసిన ప్రకటన తమ వద్ద ఉందని, ఇది చాలా తీవ్రమైన అంశమని అన్నారు. "మా నేతకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వేళ్లు నరికివేయాలి" అని సదరు మంత్రి అన్నారని పేర్కొన్నారు.

కపిల్ సిబల్ స్పందిస్తూ... ప్రతిపక్ష నాయకుడు ఏం చెప్పారో కూడా నేను చెబుతానని, బుల్లెట్లు పేలుస్తానని వ్యాఖ్యానించారని సువెందు (అధికారి) అన్నారని పేర్కొన్నారు.

వారి వాగ్వాదం నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ జోక్యం చేసుకున్నారు. దయచేసి దీనిని ఎవరూ రాజకీయం చేయవద్దు... చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. త్వరితగతిన, సమర్థవంతమైన విచారణతో చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు.

Supreme Court
Kolkata
West Bengal
  • Loading...

More Telugu News