Komatireddy Venkat Reddy: తెలంగాణలో బీఆర్ఎస్ ఎక్కడుంది?: కోమటిరెడ్డి

There is no BRS in Telangana says Komatireddy

  • బీజేపీలో బీఆర్ఎస్ కలిసిపోయిందన్న కోమటిరెడ్డి
  • సెబీ ఛైర్ పర్సన్ అక్రమాలపై విచారణ వేయాలని డిమాండ్
  • అదానీ ఆస్తులపై న్యాయ విచారణ జరగాలన్న కోమటిరెడ్డి

తెలంగాణలో టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎప్పుడో బీజేపీలో కలిసిపోయిందని చెప్పారు. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. 

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జి దీపా దాస్ మున్షి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

అదానీ మెగా కుంభకోణంపై విచారణ జరపాలని ఈ సందర్భంగా కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. సెబీ ఛైర్ పర్సన్ అక్రమాలపై జేపీసీ వేయాలని, ఆమె రాజీనామా చేయాలని అన్నారు. 

విదేశాల నుంచి నల్లధనం తెస్తామని, పేదల ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామన్న మోదీ... చివరకు 15 పైసలు కూడా వేయలేదని దుయ్యబట్టారు. పేదలను పట్టించుకోని మోదీ... అదానీని మాత్రం ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో చేర్చారని కోమటిరెడ్డి మండిపడ్డారు. 

రాహుల్ గాంధీ ప్రధాని కాకపోతే... ఈ దేశాన్ని నలుగురి చేతుల్లో పెట్టి మోదీ నాశనం చేస్తారని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయని... లేకపోతే కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లను గెలుచుకునేదని అన్నారు. అదానీ ఆస్తులు విపరీతంగా పెరగడంపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News