Vijay: పార్టీ జెండాను ఆవిష్కరించిన స్టార్ హీరో విజయ్

Actor Vijay launches his political party flag

  • తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించిన విజయ్
  • చెన్నైలో పార్టీ జెండాను ఆవిష్కరించిన విజయ్
  • కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, మద్దతుదారుల హాజరు

తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్న విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో ఆయన రాజకీయ పార్టీని స్థాపించారు. తాజాగా పార్టీకి చెందిన జెండాను ఆయన ఆవిష్కరించారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో పార్టీ జెండాను విజయ్ ఎగురవేశారు. 

ఎరుపు, పసుపు రంగుల్లో జెండా ఉంది. జెండా మధ్యలో సూర్యకిరణాలు, పక్కనే రెండు ఏనుగులు అటూ, ఇటూ ఉన్నాయి. మరోవైపు, పార్టీ జెండాతో పాటు పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ తల్లిదండ్రులతో పాటు అభిమానులు, పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More Telugu News