APPSC: ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు వాయిదా

appsc group 1 mains exams postponed

  • ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా
  • సెప్టెంబర్ 2 నుండి 9 వరకూ జరగాల్సిన షెడ్యూల్ వాయిదా
  • సవరించిన షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని ప్రకటించిన ఏపీపీఎస్‌సీ

గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్‌సీ ప్రకటించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2 నుండి 9 వరకు (7వ తేదీ మినహా) పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే అభ్యర్ధుల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్‌సీ తెలిపింది. సవరించిన షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. 

ఏపీలో మొత్తం 81 గ్రూపు 1 పోస్టుల భర్తీకి గానూ మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలకు మొత్తం 1,48,881 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 4,496 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు.

APPSC
Group 1 Exams
  • Loading...

More Telugu News