Rashmi Gautam: యాంకర్ రష్మి ఇంట విషాదం

Anchor Rashmi grand father passes away

  • రష్మి తాతయ్య కన్నుమూత
  • ఈ నెల 17న చనిపోయారని చెప్పిన రష్మి
  • బామ్మ కోసం వెళ్లిపోయారని వ్యాఖ్య

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్ రష్మి పలు టీవీ షోలతో బిజీగా ఉంటోంది. మధ్యమధ్యలో సినిమా అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకుంటూ తన కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. తాజాగా రష్మి ఇంట్లో విషాదకర వాతావరణం నెలకొంది. రష్మి తాతయ్య తుదిశ్వాస విడిచారు. 

ఈ నెల 17న తన తాతయ్య చనిపోయారనే విషయాన్ని ఆమె ఈరోజు ఎక్స్ వేదికగా వెల్లడించారు. తమ బామ్మ, తాతయ్యల మనసులు విడదీయలేనివని... ఆమె భౌతికంగా దూరమయ్యాక తాతయ్య ఎంత వేదన అనుభవించారో తమకు తెలుసని చెప్పారు. తాతయ్య తమతో ఉండాలని తాము కోరుకున్నామని... కానీ, ఆయన బామ్మ కోసం వెళ్లిపోయాడని అన్నారు.

Rashmi Gautam
Tollywood
  • Loading...

More Telugu News