China: రేపే మెగాస్టార్ బర్త్ డే

Chiranjeevi birthday

  • 1955లో మొగల్తూరులో జన్మించిన చిరంజీవి
  • తిరుమలలో పుట్టినరోజును జరుపుకోనున్న మెగాస్టార్
  • రేపు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొననున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే మెగా ఫ్యాన్స్ కు పండగే. తమ అభిమాన నటుడి పుట్టినరోజును అభిమానులు ఒక పండుగలా జరుపుకుంటారు. ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. రేపే (ఆగస్ట్ 22) చిరంజీవి పుట్టినరోజు. చిరు రేపు తన 69వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. 1955 ఆగస్ట్ 22న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో చిరంజీవి జన్మించారు. ఈ పుట్టినరోజును చిరంజీవి తన అభిమానులకు దూరంగా కుటుంబసభ్యులతో కలిసి తిరుమలలో జరుపుకోనున్నారు. రేపు తెల్లవారుజామున తన కుటుంబంతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొంటారు.

More Telugu News