IRCTC: బాల రాముడిని, కాశీనాథుడిని దర్శించుకునే అవకాశం.. సికింద్రాబాద్ నుంచి ఐఆర్ సీటీసీ టూర్ వివరాలు ఇవిగో!

IRCTC Ganga Sarayu Darshan Tour Package

  • సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులో బుకింగ్
  • ఐదు రాత్రులు, ఆరు పగళ్లు కొనసాగనున్న ‘గంగా సరయూ దర్శన్’ టూర్
  • వారణాసి, అయోధ్యలో సైట్ సీయింగ్

అయోధ్య బాల రాముడిని, కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవడానికి ఇండియన్ రైల్వే సరికొత్త టూర్ ను ప్రకటించింది. గంగా సరయూ దర్శన్ పేరుతో ఐఆర్ సీటీసీ తీసుకొచ్చిన ఈ టూర్ ప్రతీ ఆదివారం మొదలవుతుంది. ఐదు రాత్రులు, ఆరు పగళ్లు కొనసాగుతుంది. వచ్చే నెల 22 నుంచి బుకింగ్ అందుబాటులో ఉంది. ఉత్తరాదిలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు తెలంగాణ వాసులకు ఇదొక చక్కని అవకాశం. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ వరకు వివిధ జంక్షన్ లలో ఈ రైలు ఎక్కే అవకాశం ఉంది.

సికింద్రాబాద్ నుంచి ప్రారంభం..
  • ఆదివారం ఉదయం 9:25 గంటలకు దానాపూర్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా ప్రయాణం.
  • సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు వారణాసి స్టేషన్ కు చేరుకుంటారు. ముందుగా బుక్ చేసిన హోటల్ లో బస చేసి సోమవారం సాయంత్రం గంగా హారతి, కాశీ టెంపుల్ దర్శనం. రాత్రి అక్కడే వసతి.
  • మంగళవారం కాశీ విశ్వనాథ ఆలయం, కాలభైరవ్ మందిర్, బిర్లా మందిర్ తదితర ఆలయాల సందర్శన. సాయంత్రం షాపింగ్, సైట్ సీయింగ్.
  • బుధవారం బ్రేక్ ఫాస్ట్ చేసి అయోధ్యకు పయనం. హోటల్ లో దిగి ఫ్రెషప్ అయ్యాక బాలరాముడి ఆలయం, హనుమాన్ గర్హి, దశరథ్ మహల్ సందర్శన. సాయంత్రం సరయూ ఘాట్ సందర్శన, రాత్రికి ప్రయాగ్ రాజ్ లో వసతి
  • గురువారం బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసి హోటల్ నుంచి చెక్ ఔట్.. ప్రయాగ్ రాజ్ జంక్షన్ నుంచి రాత్రి 7:45 గంటలకు తిరుగు ప్రయాణం.
  • శుక్రవారం రాత్రి 9:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు.

టికెట్ ధరలు ఇలా..
  • థర్డ్ ఏసీలో రూ.41,090 (సింగిల్ షేరింగ్), రూ.24,350 (ట్విన్ షేరింగ్), రూ.19,720 (ట్రిపుల్ షేరింగ్).. పిల్లల (5 నుంచి 11 ఏళ్లు) కు బెడ్ తో రూ.15,390, వితౌట్ బెడ్ తో రూ.13,790

  • స్లీపర్ బెర్త్ లో రూ.21,620 (సింగిల్ షేరింగ్), రూ.17,220 (ట్విన్ షేరింగ్), రూ.16,710 (ట్రిపుల్ షేరింగ్).. పిల్లల (5 నుంచి 11 ఏళ్లు) కు బెడ్ తో రూ.13,620, వితౌట్ బెడ్ తో రూ.12,010

టూర్ లో ఇతరత్రా ఏర్పాట్లు..
థర్డ్ ఏసీ బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఏసీ గదులు, ఏసీ వాహనం ఏర్పాటు చేస్తారు. మూడు రోజులు ఉదయం టిఫిన్, రాత్రి భోజనం ప్యాకేజీలో భాగంగా ఏర్పాటు చేస్తారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా టికెట్ ధరలోనే ఉంటుంది. టూర్ లో భాగంగా వెళ్లే పర్యాటక ప్రదేశాల్లో ఎంట్రన్స్ టికెట్, ట్రైన్ లో భోజనం, ఆలయాల్లో దర్శన టికెట్, టూర్ గైడ్ తదితర ఖర్చులు యాత్రికులే భరించాల్సి ఉంటుంది.

వివరాలకు..
ఐఆర్ సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్ సికింద్రాబాద్.. మొబైల్: 8287932229 / 8287932228 / 9701360701

  • Loading...

More Telugu News