Maharashtra Teacher: అమ్మాయిలకు పోర్న్ వీడియోలు చూపిస్తూ స్కూల్ టీచర్ లైంగిక వేధింపులు

Akola govt teacher shows porn videos to school girls

  • మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ఘటన
  • 8వ తరగతి బాలికలకు నాలుగు నెలలుగా పోర్న్ వీడియోలు చూపిస్తున్న ఉపాధ్యాయుడు
  • మహిళా కమిషన్‌కు ఫిర్యాదు.. నిందితుడి అరెస్ట్

మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో నర్సరీ చదువుతున్న ఇద్దరు చిన్నారులపై స్వీపర్ లైంగిక వేధింపుల ఘటన మరువక ముందే అదే రాష్ట్రంలోని అకోలా జిల్లాలో జరిగిన మరో దారుణం తాజాగా వెలుగుచూసింది. ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు 8వ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థినులకు నెలల తరబడి పోర్న్ వీడియోలు చూపిస్తూ వారిని వేధిస్తున్నాడు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో విషయం బయటపడింది.

నిందితుడైన ఉపాధ్యాయుడిని 47 ఏళ్ల ప్రమోద్ సర్దార్‌గా గుర్తించారు. బాధిత విద్యార్థి ఒకరు చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. అధికారులు నిన్న స్కూలుకు వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం ప్రమోద్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 

నిందితుడు గత నాలుగు నెలలుగా పోర్న్ వీడియోలు చూపిస్తూ వేధింపులకు గురిచేస్తున్నట్టు బాలికలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు ఆషా మిర్గే డిమాండ్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Maharashtra Teacher
Akola
Porn Videos
School Girls
  • Loading...

More Telugu News