Chiranjeevi: రేపు శిల్పకళావేదికలో చిరంజీవి మెగా బర్త్ డే వేడుకలు
![Mega birthday celebrations of Chiranjeevi will be held tomorrow in Hyderabad](https://imgd.ap7am.com/thumbnail/cr-20240820tn66c4a80f2419e.jpg)
టాలీవుడ్ మెగాస్టార్, లక్షలాది అభిమానులకు ఆరాధ్య కథానాయకుడు చిరంజీవి ఎల్లుండి (ఆగస్టు 22) పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఇప్పటికే మెగా అభిమానులు సంబరాలు షురూ చేశారు. ఈ క్రమంలో రేపు హైదరాబాదులో చిరంజీవి మెగా బర్త్ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం శిల్పకళావేదికలో రేపు (ఆగస్టు 21) సాయంత్రం 5.04 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మెగా బర్త్ డే ఈవెంట్ లో అనేక సర్ ప్రైజ్ లు ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు.
![](https://img.ap7am.com/froala-uploads/20240820fr66c4a7e3c53dd.jpg)