Kolli Ramu: చిరంజీవి ఐ అండ్ బ్ల‌డ్ సెంటర్ కి సోద‌రి క‌ళ్లను దానం చేసిన ముర‌ళీ మోహ‌న్ మేక‌ప్ మ్యాన్ కొల్లి రాము

Murali Mohan make up man Kolli Ramu donates his sister eyes to Chiranjeevi Eye and Blood center

 


కళ్లు లేని వారికి చూపును ప్ర‌సాదించేలా నేత్ర‌దానంలో కీల‌క పాత్ర పోషించ‌ట‌మే కాదు, ప్ర‌మాదాల్లో ఉన్న వ్య‌క్తుల‌కు స‌కాలంలో ర‌క్తాన్ని అందించే సేవా కార్య‌క్ర‌మాల్లో చిరంజీవి ఐ అండ్ బ్ల‌డ్ సెంటర్ ముందుంటుంది. 

తెలుగు చిత్ర సీమ‌ సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత ముర‌ళీ మోహ‌న్ మేక‌ప్ మ్యాన్ కొల్లి రాము సోద‌రి ప‌మిడిముక్క‌ల రాజ్య‌ల‌క్ష్మి మంగ‌ళ‌వారం ఉద‌యం క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని కొల్లి రాము... చిరంజీవి ఐ అండ్ బ్ల‌డ్ సెంటర్ కి చేర‌వేయ‌గా వెంట‌నే వారు స్పందించారు. రాజ్య‌ల‌క్ష్మి తాను చ‌నిపోయిన‌ప్ప‌టికీ నేత్ర‌దానం చేయ‌టం ద్వారా మ‌రో ఇద్ద‌రికీ చూపును అందించి ఎంద‌రికో ఆద‌ర్శ‌ప్రాయంగా మారారు. 

ఈ సంద‌ర్భంగా ముర‌ళీమోహ‌న్‌ కు, కొల్లి రాము ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు చిరంజీవి ఐ అండ్ బ్ల‌డ్ సెంటర్ ప్రతినిధులు ధ‌న్య‌వాదాల‌ను తెలియజేశారు.

More Telugu News