: అమెరికా, చైనా సంయుక్త పోరాటం


అగ్రదేశాధ్యక్షులిద్దరూ భేటీ అయ్యారు. పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. దక్షిణ కాలిఫోర్నియాలోని డెసెర్ట్ ఎస్టేట్ లో సమావేశమైన అమెరికా, చైనా అధ్యక్షులు తమ అంతర్గత బంధాలను పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎత్తుకు పైఎత్తు వేసుకుని ఆధిపత్యాన్ని ప్రదర్శించే ఈ రెండు దేశాలు పలు అంశాలపై చర్చించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య జరిగిన భేటీలో ఇరుదేశాలు సైబర్ భద్రతపై కలిసి పోరాడేందుకు ఒప్పందం చేసుకున్నారు. మార్చిలో పదవీబాధ్యతలు స్వీకరించిన జిన్ పింగ్ అధ్యక్షుడయ్యాక తొలిసారి అమెరికా వచ్చారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశంలో సైబర్ భద్రత, మేథో హక్కుల గురించి ప్రధానంగా చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News