Tank bund: హుస్సేన్ సాగర్ కు భారీ వరద.. లోతట్టు ప్రాంతాలకు అధికారుల హెచ్చరిక

Heavy inflows into Hussain Sagar

--


జంటనగరాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షానికి హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో నీటి నిల్వ ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో ట్యాంక్ బండ్ గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ట్యాంక్ బండ్ కు 1850 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే ఉద్యోగులకు సెలవులు రద్దు చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్.. అలర్ట్ గా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సిటీ రోడ్లు జలమయంగా మారాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి మళ్లీ వర్షం కురుస్తుండడంతో వరద నీరు హుస్సేన్ సాగర్ లోకి చేరుతోంది. దీంతో గంటగంటకూ ట్యాంక్ బండ్ లో నీటిమట్టం పెరుగుతోంది.

Tank bund
Hussain Sagar
Flood
GHMC
Heavy Rain

More Telugu News