Seema Pahuja: కోల్‌కతా హత్యాచార ఘటన.. దర్యాప్తు అధికారిగా ఏఎస్పీ సీమా పహుజాను నియమించిన సీబీఐ.. ఎవరీమె?

Kolkata Horror Case CBI appoints ASP Seema Pahuja to probe matter

  • సీబీఐలో షార్పెస్ట్ మహిళాధికారిగా పేరు సంపాదించుకున్న సీమా పహుజా
  • కేసు ఆమె చేతిలో పడిందంటే విజయం పక్కా అనే పేరు 
  • ఇన్వెస్టిగేషన్ ప్రతిభకుగాను రెండుసార్లు గోల్డ్ మెడల్స్
  • దర్యాప్తులో తొలిసారి శాస్త్రీయ సాంకేతికను ఉపయోగించింది సీమనే

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచార కేసును దర్యాప్తు చేసుకున్న సీబీఐ విచారణ అధికారిగా ఏఎస్పీ సీమా పహుజాను నియమించింది. దీంతో ఆమె ఎవరన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది. సీబీఐలో షార్పెస్ట్ విమెన్‌గా పేరు సంపాదించుకున్న సీమాకు ఇలాంటి కేసుల ఛేదనలో ఎంతో అనుభవం ఉంది. ఆమె ఇన్వెస్టిగేషన్ ప్రతిభకు గాను 2007, 2018లో రెండుసార్లు గోల్డ్ మెడల్ అందుకున్నారు. 

తొలిసారి శాస్త్రీయ సాంకేతికత
సిమ్లాలోని గుడియాలో జరిగిన అత్యాచారం, హత్య కేసును దర్యాప్తు చేసిన సీమా తొలిసారి శాస్త్రీయ సాంకేతికతను ఉయోగించారు. అలాగే, సైంటిఫిక్ ఆధారాలతోనే హత్రాస్ కేసును ఛేదించగలిగారు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఒకానొక సమయంలో ఆమె విధుల నుంచి స్వచ్ఛందగా తప్పుకోవాలని భావించారు. అయితే అప్పటి సీబీఐ డైరెక్టర్ అందుకు నిరాకరించి రిటైర్ కాకుండా ఆమెను ఒప్పించగలిగారు.

కేసుల దర్యాప్తు విషయంలో సీమా బయటి నుంచి ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ దర్యాప్తు విషయంలో వెనకడుగు వేయరనే పేరుంది. కేసు ఆమె చేతిలో పడిందంటే తప్పకుండా విజయం సాధించి తీరుతారని సహచర అధికారులు చెబుతారు. కోల్‌కతా జూనియర్ వైద్యారాలిపై అత్యాచారం, హత్య కేసును కూడా ఆమె దర్యాప్తు చేయనుండడంతో నిందితులు తప్పించుకోలేరని సీబీఐ విశ్వాసం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News