America: అమెరికాలో 100 అడుగుల హ‌నుమాన్ విగ్ర‌హం

100 Feet Hanuman Statue in America


స్టాచ్యూ ఆఫ్ యూనియ‌న్ (ఎస్ఓయూ) పేరిట అమెరికాలో 100 అడుగుల భారీ హ‌నుమాన్ విగ్ర‌హాన్ని ప్రతిష్ఠించారు. టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్ట‌న్ న‌గ‌ర ప‌రిధిలోని అష్ట‌ల‌క్ష్మీ దేవాల‌య ప్రాంగ‌ణంలో ఆదివారం ఈ మ‌హా విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. 

భార‌త సంస్కృతీ సంప్ర‌దాయాలు ఉట్టిప‌డేలా నాలుగు రోజుల పాటు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. దీనికి చిన్న‌జీయ‌ర్ స్వామి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌కు భారీ మొత్తంలో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా జై వీర హ‌నుమాన్ నామ‌స్మ‌ర‌ణ‌తో ఆల‌య ప్రాంగ‌ణం మార్మోగిపోయింది. ఈ భారీ విగ్ర‌హంపై హెలికాప్ట‌ర్‌తో పూల వ‌ర్షం కురిపించ‌డం హైలైట్‌గా నిలిచింది.

America
Hanuman Statue
  • Loading...

More Telugu News