Mamata Banerjee: మమతా బెనర్జీపై అనుచిత పోస్ట్.. బీకాం స్టూడెంట్ అరెస్టు

Student Arrested For Shoot Mamata Banerjee comments in Social Media

  • పశ్చిమ బెంగాల్ సీఎంపై సోషల్ మీడియాలో పోస్టు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన టీఎంసీ కార్యకర్తలు
  • డిగ్రీ విద్యార్థిని అరెస్టు చేసిన కోల్ కతా పోలీసులు

కోల్ కతాలో ట్రెయినీ డాక్టర్ హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నేతలపై పలువురు విరుచుకుపడుతున్నారు. పోలీసుల విచారణ తీరుపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ విద్యార్థి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టు పెట్టాడు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కాల్చి చంపినట్లే మమతా బెనర్జీపైనా కాల్పులు జరపాలంటూ తన ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ లో రాసుకొచ్చాడు. ఈ పోస్టును చూసిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు బీకాం సెకండియర్ చదువుతున్నాడని చెప్పారు.
 
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. క్రితిసోషల్ అనే ఇన్ స్టా గ్రామ్ ఎకౌంట్ లో మమతా బెనర్జీ దాడిని రెచ్చగొట్టేలా కామెంట్లు ఉన్నాయి. ఇందిరా గాంధీ హత్య తరహాలోనే మమతా బెనర్జీపైనా కాల్పులు జరపాలని, ఒకవేళ ఈ ప్రయత్నంలో విఫలమైనా తానేమీ నిరుత్సాహపడబోనని సదరు స్టూడెంట్ రాసుకొచ్చాడు. అంతేకాదు, ఈ నెల 9న కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో హత్యాచారానికి గురైన బాధితురాలి పేరు, ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. దీంతో సీఎంపై హత్యాయత్నానికి, అల్లర్లకు రెచ్చగొట్టడం, అత్యాచార బాధితురాలి వివరాలను బయటపెట్టడం తదితర నేరాల కింద స్టూడెంట్ ను అరెస్టు చేసినట్లు కోల్ కతా పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News