Girl Suicide: వేధింపులతో మృత్యుముఖంలోకి.. సోదరులకు రాఖీ కట్టాక కన్నుమూసిన యువతి

Girl dies after tying rakhi to brothers in Mahabubabad
  • మహబూబాబాద్ లో విషాదం.. చూపరులను కంటతడి పెట్టిస్తున్న దారుణం
  • ప్రేమ పేరుతో తోటి విద్యార్థి వేధింపులు
  • భరించలేక పురుగుల మందు తాగిన యువతి
ప్రేమ పేరుతో తోటి విద్యార్థి వేధిస్తుంటే ఆ యువతి తట్టుకోలేక పోయింది.. తన వెంట పడొద్దని ప్రాధేయపడ్డా వినిపించుకోకపోవడంతో భరించలేక ఆత్మహత్యాయత్నం చేసింది. మృత్యువుతో పోరాడుతూ రాఖీ పండుగ వరకూ ప్రాణాలతో ఉంటానో లేదోనని అన్నాతమ్ముళ్లకు శనివారమే రాఖీ కట్టింది. ఆపై కాసేపటికే యువతి కన్నుమూసింది. మహబూబాబాద్ లో జరిగిన ఈ విషాద సంఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. శనివారం రాత్రి నర్సింహులపేట మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలానికి చెందిన ఓ యువతి కోదాడలో డిప్లొమా చదువుతోంది. కాలేజీలో తనతో పాటే చదువుకుంటున్న ఓ విద్యార్థి ప్రేమిస్తున్నానంటూ యువతి వెంటపడుతున్నాడు. తనకలాంటి ఉద్దేశమేదీ లేదని, తన వెంట పడొద్దని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన యువతి శనివారం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు యువతిని ఆసుపత్రిలో చేర్పించారు. ఓవైపు డాక్టర్లు వైద్యం చేస్తుండగా.. సోమవారం రాఖీ పండగ వరకూ ప్రాణాలతో ఉంటానో లేదోనని భావించి కుటుంబ సభ్యులకు చెప్పి రాఖీలు తెప్పించుకుంది. అన్నకు, తమ్ముడికి ఆ రాఖీలను కట్టి కాసేపటికే కన్నుమూసింది. కాగా, యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Girl Suicide
Rakhi Festival
Kodhada
Crime News

More Telugu News