Monkeypox Virus: పాకిస్థాన్ కు చేరిన మంకీపాక్స్.. భారత్ లో ఆందోళన

Monkeypox virus reaches to Pakistan

  • ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్
  • గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
  • ఇప్పటి వరకు 30 వేలకు పైగా కేసుల నమోదు

మంకీపాక్స్ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. అన్ని దేశాలు మంకీపాక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 30 వేలకు పైగా కేసులు నమోదు కాగా... 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పుడు మంకీపాక్స్ వైరస్ మన పొరుగు దేశం పాకిస్థాన్ కు చేరింది. దీంతో మన దేశంలో కూడా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2022లో ఈ వైరస్ ప్రపంచాన్ని వణికించింది. అప్పుడు 116 దేశాల్లో వైరస్ వ్యాపించింది. ఆ సమయంలో లక్షకు పైగా కేసులు నమోదు కాగా... ఇండియాలో కూడా 30 కేసులను గుర్తించారు.

Monkeypox Virus
Pakistan
India
  • Loading...

More Telugu News