Spa: చందానగర్ లో స్పా ముసుగులో వ్యభిచారం... ఏడుగురి అరెస్ట్

Police busted sex racket in Chandanagar


హైదరాబాదులో స్పా ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచార రాకెట్ ను పోలీసులు బట్టబయలు చేశారు. చందానగర్ లోని ఓ స్పా-సెలూన్ పై ఇవాళ పోలీసులు దాడి చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు నిర్దిష్ట సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారు. స్పాలో వ్యభిచారం జరుగుతున్నట్టు గుర్తించారు. ఈ వ్యవహారంలో నలుగురు యువతులను, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేశారు.  

కేపీహెచ్ బీ రోడ్ నెం.4లో ఉన్న ఓ సెలూన్ లోనూ వ్యభిచార దందా జరుగుతున్న సమాచారం అందుకున్న పోలీసులు... సెలూన్ పైనా దాడులు చేపట్టారు. ఈ ఘటనలో ముగ్గురు యువతులు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News