Sivaji-Laya: మరోసారి జంటగా శివాజీ-లయ... క్లాప్ కొట్టిన దిల్ రాజు

Sivaji and Laya acts in a movie as lead roles after 14 years

  • గతంలో పలు హిట్ చిత్రాల్లో కలిసి నటించిన శివాజీ, లయ
  • తాజాగా కొత్త దర్శకుడు సుధీర్ శ్రీరామ్ డైరెక్షన్ లో చిత్రం
  • 14 ఏళ్ల తర్వాత  కలిసి నటిస్తున్న శివాజీ, లయ

శివాజీ, లయ కాంబినేషన్లో వచ్చిన మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్యా చంద్రం చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. దాదాపు ఒకటిన్నర దశాబ్దం తర్వాత ఈ జంట మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శివాజీ, లయ హీరోహీరోయిన్లుగా ఓ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. దర్శకుడికి ఇదే తొలి చిత్రం. శివాజీ ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. శివాజీ సొంత బ్యానర్ శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాదులో జరిగింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ కొట్టారు. శివాజీ తనయుడు రిక్కీ కెమెరా స్విచాన్ చేశాడు. ఈ ఓపెనింగ్ సెర్మనీకి హాజరైన స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ముహూర్తం షాట్ కు దర్శకత్వం వహించారు. 

కాగా, ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఆగస్టు 20 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరలోనే ఇతర తారాగణం వివరాలు ప్రకటించనున్నారు.

  • Loading...

More Telugu News