Delhi Traffic police: లంచం సొమ్ము పంచుకుంటూ కెమెరాకు చిక్కిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు.. వీడియో ఇదిగో!

On CCTV 3 Delhi Traffic Cops Divide Bribe Money Suspended
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • ముగ్గురినీ సస్పెండ్ చేస్తూ ఎల్జీ వీకే సక్సేనా ఆదేశాలు
  • శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
విక్రమార్కుడు సినిమాలో రవితేజ, బ్రహ్మానందం దొంగ సొమ్మును పంచుకునే సీన్ గుర్తుందా.. అచ్చం అలాంటి సీన్ ఢిల్లీలో శనివారం చోటుచేసుకుంది. సినిమాలో దొంగలు డబ్బులు పంచుకుంటారు కానీ ఢిల్లీలో ట్రాఫిక్ పోలీసులు నోట్లు పంచుకున్నారు. వాహనదారుల నుంచి వసూలు చేసిన లంచం సొమ్మును నిజాయితీగా వాటాలు వేసుకున్నారు. ఢిల్లీలోని గాజీపూర్ లోని చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. అయితే, వారి వాటాల పంపకం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డవుతోందనే విషయం పాపం వారు గుర్తించలేదు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వరకు చేరింది. దీంతో ఆయన సీరియస్ గా స్పందించారు. వెంటనే సదరు ట్రాఫిక్ సిబ్బంది ముగ్గురినీ సస్పెండ్ చేశారు. వారిపై డిపార్ట్ మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించారు. ‘లంచం నోట్లు పంచుకుంటూ కెమెరాకు చిక్కిన ఇద్దరు అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్లు, ఓ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశాం. ప్రాథమిక విచారణ తర్వాత వారిపై చర్యలు తీసుకున్నాం. వారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించాం’ అంటూ ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Delhi Traffic police
Bribe Sharing
Viral Videos
LG VK Saksena

More Telugu News