Chandrababu: ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం

AP CM Chandrababu met PM Modi in Delhi

  • ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
  • మోదీ-చంద్రబాబు భేటీ 15 నిమిషాలు ఆలస్యం
  • కేంద్ర బడ్జెట్ ప్రకటన తర్వాత మోదీని తొలిసారి కలిసిన చంద్రబాబు 

ఏపీ సీఎం చంద్రబాబు ఈ సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. కేంద్ర బడ్జెట్ ప్రకటించాక... మోదీతో చంద్రబాబు సమావేశం కావడం ఇదే ప్రథమం. 

వాస్తవానికి చంద్రబాబుకు ప్రధానితో అపాయింట్ మెంట్ సాయంత్రం 4.30 గంటలకు కాగా... 15 నిమిషాలు ఆలస్యంగా సమావేశం ప్రారంభమైంది. ప్రధాని మోదీ ఇతర సమావేశాల్లో పాల్గొన్న కారణంగా చంద్రబాబుతో భేటీ షెడ్యూల్ మారింది. ఇటీవల బడ్జెట్ లో ఏపీకి సంబంధించి కేంద్రం పలు కీలక ప్రకటనలు చేసింది. అమరావతికి రూ.15 వేల కోట్లతో పాటు, పోలవరం ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖర్చు భరిస్తామని స్పష్టం చేసింది. ఈ అంశాలపై నేడు ప్రధాని మోదీతో సమావేశంలో చంద్రబాబు చర్చించనున్నారు. 

మోదీతో సమావేశం అనంతరం చంద్రబాబు... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో సమావేశం కానున్నారు.

Chandrababu
Narendra Modi
New Delhi
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
  • Loading...

More Telugu News