Habsiguda Accident: బస్సు కిందికి దూసుకెళ్లిన ఆటో... హబ్సిగూడలో టెన్త్ విద్యార్థిని దుర్మరణం

Road Accident In Habsiguda 10th Class Student Dead

--


హైదరాబాద్ లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఆటో ఆర్టీసీ బస్సు కిందికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. తీవ్ర గాయాలపాలైన ఆటో డ్రైవర్ ను స్థానికులు, పోలీసులు ఆసుపత్రికి తరలించారు. శనివారం ఉదయం హబ్సిగూడలో ఈ ప్రమాదం జరిగింది. ఆటోను ఓ ట్రక్కు ఢీకొట్టగా... అదుపు తప్పిన ఆటో ఓ బస్సు కిందికి దూసుకెళ్లింది. దాంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఆటో డ్రైవర్ ఎల్లయ్యతో పాటు అందులో ప్రయాణిస్తున్న పదో తరగతి విద్యార్థిని సాత్విక తీవ్రంగా గాయపడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు... పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. క్రేన్ సాయంతో బస్సు కింద చిక్కుకున్న ఆటోను బయటకు తీశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ కాసేపటికే సాత్విక ప్రాణాలు కోల్పోయింది. డ్రైవర్ ఎల్లయ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. 

Habsiguda Accident
Hyderabad
Road Accident
Bus Auto
Tenth Student
  • Loading...

More Telugu News