Electricity Bill: విద్యుత్ బిల్లులు గతంలోలాగే ఫోన్ తో చెల్లించ వచ్చు

Electricity Bill Payments Through UPI

  • యూపీఐ పేమెంట్స్ కు తొలగిన అడ్డంకులు
  • గూగుల్ పే, ఫోన్ పేలతో ఇంట్లో నుంచే చెల్లించే వీలు
  • బీబీపీఎస్ లో చేరిన విద్యుత్ సంస్థలు

విద్యుత్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పడనుంది. గతంలో మాదిరిగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం తదితర యూపీఐలతో చెల్లించేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. త్వరలో పాత విధానంలోనే నెలనెలా బిల్లులు చెల్లించే వీలు కలుగుతుందని భారత్ బిల్ పే లిమిటెడ్ (బీబీఎల్) సీఈవో నుపూర్ చతుర్వేది పేర్కొన్నారు. భారత్ బిల్ పేమెంట్ సిస్టం (బీబీపీఎస్) ద్వారా మాత్రమే చెల్లింపులు జరగాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో జులై 1 నుంచి యూపీఐ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించడం కుదరడంలేదు.

ఆర్బీఐ నిర్ణయం కారణంగా విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు స్పందించాయి. బిల్లు చెల్లింపులను సులభతరం చేసేందుకు టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్ లతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని ఏపీసీపీడీసీఎల్ సంస్థలు భారత్ బిల్ పేమెంట్ సిస్టంలో చేరాయి. ఫలితంగా యూపీఐలతో పాటు బ్యాంకులు, ఇతరత్రా ఫిన్ టెక్ సంస్థల సాయంతో విద్యుత్ బిల్ చెల్లించే అవకాశం వినియోగదారుడికి కలుగుతుందని చతుర్వేది వివరించారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న టీజీఎస్పీడీసీఎల్‌ ఇప్పటికే ఫోన్‌ పే ద్వారా చెల్లింపులను స్వీకరిస్తోంది. త్వరలో గూగుల్‌ పే, అమెజాన్‌ పే తో కూడా చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.

Electricity Bill
UPI Payments
Google Pay
Paytm
Fintek Apps
  • Loading...

More Telugu News