Kolkata Rape Case: కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచార ఘటనలో మరో ట్విస్ట్.. ఆ 150 గ్రాములు వీర్యం కాదట!

Kolkata doctor rape case Post mortem report denies 150 gm semen claim

  • ఆమె జననాంగంలో 150 గ్రాముల వీర్యం ఉన్నట్టు పోస్టుమార్టంలో తేలిందంటూ ప్రచారం
  • అదంతా ఒట్టిదేనని తేల్చేసిన నిజ నివేదిక
  • ఆ 150 గ్రాముల బరువున్నది గర్భసంచి అని డాక్యుమెంటేషన్‌
  • ఫోరెన్సిక్ నిపుణులను ఉటంకిస్తూ ‘న్యూస్ 18’ కథనం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో మరో కీలక విషయం వెల్లడైంది. లైంగిక దాడికి గురైన ఆమె జననాంగంలో 150 గ్రాముల వీర్యం ఉన్నట్టు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందంటూ ప్రచారం జరిగింది. దీనిని బట్టి ఆమెపై సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందని అందరూ భావించారు. బాధిత వైద్యురాలి తల్లిదండ్రులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారు.

అయితే, ఈ వార్తల్లో నిజం లేదని నిర్ధారణ అయింది. నిజ పోస్టుమార్టం నివేదిక ప్రకారం ఆమె శరీరంలో ఉన్నది 150 గ్రాముల గర్భసంచి మాత్రమే. అందులో ఎలాంటి ద్రవాలు లేవు. సాధారణంగా పోస్టుమార్టం రిపోర్టును డాక్యుమెంట్ చేస్తారు. అందులో అవయవాల బరువును కూడా పేర్కొంటారు. ఈ సందర్బంగా అందులో ప్రస్తావించింది 150 గ్రాముల బరువున్న గర్భసంచి గురించేనని, ద్రవాల గురించి కాదని ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు, వైద్యులను ఉటంకిస్తూ ‘న్యూస్ 18’ పేర్కొంది. అయితే, 150 గ్రాముల బరువున్న యుటెరస్‌ను వీర్యం అని తప్పుగా ప్రచారం చేయడంతోనే కలకలం రేగింది.

వైద్యురాలిపై దారుణం జరిగిన 5 గంటల తర్వాత ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందం చేరుకుంది. అయితే, అప్పటికే అక్కడి ద్రవాలు ఘనీభవించడంతో ఫోరెన్సిక్ బృందం వాటినే సేకరించింది. ఆ తర్వాత మూడు రోజులకు సేకరించిన రక్తం, వీర్యం అవశేషాలు సహా మరికొన్నింటిని ఆగస్టు 12న కోల్‌కతాలోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. 

ఫోరెన్సిక్ అంశాలను సేకరించడం, వాటి నిల్వ, అవసరమైన పేపర్ వర్క్ పూర్తి చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపడం వంటివి ప్రొటోకాల్ ప్రకారం చేయాల్సి ఉంటుందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News