India: భారత్ పక్కలో బల్లెంలా బంగ్లాదేశ్ మారబోతోందా?

Is Bangladesh Changing As India Enemy

  •  బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న భారత వ్యతిరేకత
  • ఇటీవల చెలరేగిన అల్లర్లలో హిందువులను లక్ష్యంగా చేసుకున్న మూకలు
  • ఆజ్యం పోస్తున్న చైనా

మొన్న మొన్నటి వరకు ఏదో ఉందంటే ఉంది అన్నట్టుగా ఉండే బంగ్లాదేశ్ ఇప్పడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఆ దేశంలో చెలరేగిన రిజర్వేషన్ల అంశం ఏకంగా ప్రభుత్వాన్నే మార్చేసింది. ఆందోళనకారుల దెబ్బకు దేశ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది.

ఒకప్పుడు పాకిస్థాన్‌లో భాగమైన బంగ్లాదేశ్.. భారత్ చొరవతో ప్రత్యేక దేశంగా అవతరించింది. ఆ తర్వాత ఆ దేశ స్థిరత్వానికి భారత్ సాయం చేస్తూనే వచ్చింది. అయితే, ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రజలు, పాలకులు క్రమంగా భారత వ్యతిరేక పంథాను అందుకున్నారు. మొన్న జరిగిన అల్లర్లలోనూ భారత వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపించింది. హిందువులపై దాడులు జరిగాయి.

ఇవన్నీ చూస్తుంటే బంగ్లాదేశ్ మనకు పక్కలో బల్లెంలా తయారవుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు పాకిస్థాన్, మరోవైపు చైనా, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే బాటలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే, ఇది బంగ్లాదేశ్ సొంత నిర్ణయం కాదని, దాని వెనక చైనా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ మనకు శత్రువుగా తయారవుతోందని చెప్పేందుకు కొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.



  • Loading...

More Telugu News